Andhra PradeshHome Page Slider

నా కారు పక్కనపెట్టాలా.. మంత్రి కొట్టు ఆగ్రహం

ఏయ్ ఇటురా..! నా కారును ఎందుకు పక్కన పెట్టమన్నావ్. కొండ మీదకొచ్చే కార్లన్నీ సక్రమంగా వస్తున్నాయా.. అని పోలీసు అధికారిపై దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆగ్రహం చెందారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్ల పరిశీలనకు మంత్రి వచ్చారు. ఆయన కారును డ్రైవర్ కొండపై ప్రోటోకాల్ గది వద్ద పెట్టారు. అక్కడ విధుల్లో ఉన్న పోలీసు అధికారి కారును అక్కడి నుంచి తీసి వెనక్కిపెట్టాలని ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి వెళ్లేటప్పుడు ఆ పోలీసు అధికారిని పిలిచి కొండపైకి వస్తున్న వాహనాలన్నీ సక్రమంగానే వస్తున్నాయా.. నిబంధనలకు విరుద్ధంగా ఎన్నోకార్లు ఇక్కడి దాకా వచ్చాయి కదా అని నిలదీశారు. దీంతో మీ కారు తీయమని చెప్పలేదు సార్.. అంటూ పోలీసు అధికారి మంత్రిని వేడుకున్నారు.