హిందూస్తాన్ జిందాబాద్ – పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ ముస్లింల నిరసన
జమ్మూకశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడిలో మృతులకు ఇవాళ హైదరాబాద్ లోని మక్కామసీద్ లో ముస్లింలు నివాళులర్పించారు. ప్రతి ముస్లిం నల్ల రిబ్బను కట్టుకొని పహల్గాం మృతులకు నివాళులర్పించాలని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పిలుపునిచ్చారు. పహల్గంలో భారతీయులపై ఉగ్రవాద దాడిని నిరసిస్తూ ఓవైసీ ఈ పిలుపునిచ్చారు. ఆయన కూడా చేతికి నల్ల రిబ్బను ధరించి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ప్రార్థనల అనంతరం హిందూస్తాన్ జిందాబాద్ – పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ ముస్లింలు నిరసన తెలిపారు. ప్రార్థనల సందర్భంగా చార్మినార్, మక్కా మసీద్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు.