కేసీఆర్ మీటింగ్‌లో ముస్లిం మహిళల నిరసన
సీఎం కేసీఆర్ సభలో ముస్లిం మహిళలు ఆందోళనకు దిగారు. మెట్రో రెండో దశ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన తర్వాత పోలీస్ అకాడమీలో జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. అయితే కేసీఆర్ మాట్లాడుతున్న సమయంలో కొంత మంది ముస్లిం మహిళలు ఫ్లకార్డులతో నిరసన తెలిపారు. 2017 టీఆర్‌టీలో ఉర్దూ మీడియం పోస్టులకు మెరిట్ ప్రకారం నియామకాలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న మహిళలను పోలీసులు అక్కడి నుంచి బయటకు పంపించారు.

