ముస్లింల త్యాగాలకు చరిత్రలో స్థానం లేదు
- ముస్లిం స్వాతంత్ర్య పోరాట యోధులపై ఓవైసీ కామెంట్స్
- ముస్లింల పాత్రను పాలకులు విస్మరించారని విమర్శ
- “జై హింద్” నినాదాన్ని ఇచ్చిన సత్రానీని పట్టించుకోలేదని ఆవేదన
తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రిసెర్చ్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో పాల్గొన్న ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ దేశ స్వాతంత్ర్య పోరాటంలో ముస్లింల పాత్రను విస్మరించారని పాలకులపై విమర్శలు చేశారు. స్వాతంత్ర్య సంగ్రామంలో ముస్లింలు కూడా కీలకంగా పాల్గొన్నప్పటికీ, వారి త్యాగాలు చరిత్రలో స్థానం పొందలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన అజాద్ హింద్ ఫౌజ్‌లో హైదరాబాదీ అయిన అబిద్ హసన్ సత్రాని ముఖ్య పాత్ర పోషించడమే కాకుండా “జై హింద్” నినాదాన్ని ఇచ్చారని గుర్తుచేశారు. నేతాజీకి ప్రధాన అనుచరుడైన సత్రానీని కూడా పాలకులు పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు.


 
							 
							