Andhra PradeshHome Page Slider

మృతదేహంతో ముస్లింల ఆందోళన

అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం ఈతకోట గ్రామంలో ముస్లింలు ఆందోళన చేస్తున్నారు. వారు మృతదేహంతో ఈ ఆందోళన చేపట్టారు. దీనికి కారణం అక్కడ మృతి చెందిన వారి అంత్యక్రియలు నిర్వహించేందుకు స్మశానవాటిక లేకపోవడమే. మీరాబీ అనే మహిళ మృతి చెందడంతో వారు స్థానిక గ్రామ పంచాయితీ కార్యాలయం వద్ద మృతదేహంతో నిరసన మొదలుపెట్టారు. ఖబరిస్థాన్ (స్మశానం)కు అనుకూలమైన స్థలం లేకపోవడం వల్ల తమకు చాలా ఇబ్బందిగా ఉందని, ఎవరైనా మరణిస్తే రావులపాలెం, వెదిరేశ్వరం వంటి గ్రామాలకు వెళ్లాల్సి వస్తోందన్నారు. 2022లో తమకు స్థానిక నెక్కంటి కాలనీలో ఐదు సెంట్ల స్థలం కేటాయించినా తమకు అప్పగించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనితో పంచాయితీ అధికారులు, ముస్లింపెద్దలతో మాట్లాడి ఆ స్థలాన్ని ఇప్పిస్థామని హామీ ఇచ్చారు.