ట్రంప్ ప్రభుత్వంలో పదవిపై మస్క్ స్పందన
అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ ట్రంప్‌కు టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ నుండి పూర్తి మద్దతు లభిస్తోంది. తాను అధికారంలోకి వస్తే మస్క్‌కు కేబినెట్ హోదా ఇస్తానని, సలహాదారుగా నియమిస్తానని లేదా సముచిత స్థానం కల్పిస్తానని ట్రంప్ ప్రకటించారు. ఈ విషయంపై మస్క్ కూడా స్పందించారు. ఫెడరల్ ఏజెన్సీలలో ఆడిటింగ్ నిర్వహించేందుకు మస్క్‌తో పాటు ఉన్నతస్థాయి వ్యాపార నిపుణులను చేర్చుకోవాలని ట్రంప్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. దీనిపై మస్క్ ఆసక్తి చూపించారు. ప్రభుత్వ పెట్టుబడులను క్రమబద్దీకరించవలసిన అవసరం ఉందని, నేనిక వేచి చూడలేను. ప్రభుత్వంలో అనవసరమైన వృథా, నియంత్రణలను అరికట్టాలి అంటూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీకి నేతృత్వం వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ మస్క్ వెల్లడించారు.