BusinessHome Page SliderInternationalNews

వాట్సాప్‌కు పోటీగా మస్క్ కొత్త యాప్

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌ అంటేనే అద్భుతాలకు, సంచలనాలకు మారుపేరు. డేరింగ్‌, డాషింగ్‌ నిర్ణయాలు తీసుకోవడంలో దిట్ట. ఈక్రమంలో తాజాగా మరో సంచలనానికి తెరదీశారు. వివరాల్లోకెళ్తే.. ప్రముఖ మెసేజింగ్‌ యాప్ వాట్సాప్‌ (WhatsApp)కు పోటీగా ఎక్స్ యాప్ ఇప్పుడు ఎక్స్ చాట్ (XChat)ను తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ ఎక్స్‌ చాట్‌ తన వినియోగదారులకు అంతరాయం లేని, సురక్షితమైన మెసేజింగ్ అనుభవాన్ని అందిస్తామని ఛాలెంజ్‌ చేస్తున్నాడు. ఎలాన్ మస్క్‌కు చెందిన ఎక్స్ యాప్‌లో కొత్తగా ఎక్స్‌ చాట్‌ (XChat) పేరుతో చాట్ ఇంటర్ ఫేస్‌ను ప్రవేశపెట్టారు. ఈ ఎక్స్ చాట్ అనేది ఇన్-యాప్ డైరెక్ట్ మెసేజింగ్ ఫీచర్. ఇది వాట్సాప్ (WhatsApp), ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram), టెలిగ్రామ్‌ (Telegram) మాదిరిగానే నిరంతరాయంగా చాట్‌ చేసుకునే వీలు కల్పిస్తుంది. ఈ ఎక్స్‌ చాట్‌లో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌, డిసప్పియరింగ్‌ మెసేజెస్, ఆడియో/ వీడియో కాల్స్ వంటి లేటెస్ట్‌ ఫీచర్లను హైలైట్ చేస్తూ ఎలాన్‌ మస్క్ ఎక్స్‌ వేదికగా వివరాలు ప్రకటించారు.