ముంబయి సిద్ధి వినాయక ఆలయాన్ని దర్శించుకున్న మస్క్ తల్లి
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తల్లి మాయే మస్క్ ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్నారు. ఇందులోభాగంగా ఆమె బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌తో కలిసి ముంబయిలోని సిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. ఈమేరకు జాక్వెలిన్ మాయేతో తీసుకున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆమెతో కలిసి దేవున్ని దర్శించుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. తాను రాసిన పుస్తకం ‘ఉమెన్ మేక్స్ ఎ ప్లాన్’ హిందీ ఎడిషన్‌ను ఆవిష్కరించడానికి మాయే ముంబయి వచ్చినట్లు సమాచారం. ఇటీవల ఆమె తన 77వ పుట్టిన రోజు వేడుకలను ఇక్కడే జరుపుకున్నట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ‘‘ఎ ఉమెన్ మేక్స్ ఎ ప్లాన్’’ అనే పుస్తకంలో మాయే తన కుటుంబం ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ప్రస్తావించారు.