ట్రంప్ విజయంపై మస్క్ కీలక వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్ష ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ తరుణంలో ట్రంప్‌కు పూర్తి మద్దతుగా నిలిచిన ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ ఎన్నికల ఫలితాలలో విజయం దిశగా దూసుకుపోతున్నారు. ఈ విజయంపై ఎక్స్ వేదికగా మస్క్ స్పందించారు. ‘గేమ్ సెట్ అండ్ మ్యాచ్’ అంటూ వ్యాఖ్యానించారు. అమెరికన్ ప్రజలు ట్రంప్‌కు ఖచ్చితమైన మెజారిటీ, క్రిస్టల్ క్లియర్‌గా ఇస్తున్నారని తెలిపారు. ట్రంప్ గెలిస్తే మస్క్‌ను కేబినెట్‌కు సమానమైన పదవి ఇస్తానంటూ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

