Home Page SliderInternational

“పుతిన్ తన స్నేహితుడు కాదన్న మస్క్”

ప్రపంచ కుబేరుడు,టెస్లా అధినేత ఎలాన్ మస్క్ రష్యా అధ్యక్షుడిపై సంచలన ట్వీట్ చేశారు. గత సంవత్సరంలో ఉక్రెయిన్‌పై రష్యా యుద్దం మొదలు పెట్టిన విషయం తెలిసిందే.  అయితే ఈ యుద్దం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎలాన్ మస్క్ ట్వీట్ సంచలనంగా మారింది. కాగా యుద్ద సమయంలో తాను ఉక్రెయిన్‌కు సహాయం చేసినందుకుగాను పుతిన్ తనను యుద్ద నేరస్థుడిగా అభివర్ణించారన్నారు. కాబట్టి పుతిన్ ఖచ్చితంగా తన స్నేహితుడు కాదని ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. ఈ క్రమంలో రష్యా అధినేతలు ఎందుకు ట్విటర్ వాడనిస్తున్నారని ఒక యూజర్ మస్క్‌ను ప్రశ్నించారు. దీనికి మస్క్ ప్రతిదానికీ ఓ పరిధి ఉంటుందన్నారు. అయితే ఆ పరిధిని వాళ్లే తెలుసుకుంటారని మస్క్ ఆ యూజర్‌కు సమాధానమిచ్చారు.