హత్యనా..? ఆత్మహత్యనా..?
మై హోమ్ అవతార్ 10వ టవర్ లోని 18వ అంతస్తుపై నుంచి పడి మూడేళ్ల చిన్నారి సహా తల్లి మృతి చెందింది. ఇది ఆత్మహత్యా లేక హత్యనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘటన ఆదివారం అర్ధరాత్రి నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మై హోమ్ అవతార్ లోని 3వ టవర్లో మానస దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి కృష్ణా అనే మూడేళ్ల కుమార్తె ఉంది. కుమార్తెతో కలిసి మానస 10వ టవర్ కు వెళ్లింది. అందులోని 18వ ప్లోర్ నుంచి కింద పడి ఇద్దరూ మృతి చెందారు. 3వ టవర్ లో ఉండే మానస 10వ టవర్ కు ఎందుకు వెళ్లింది..? ఆ సమయంలో మానస భర్త ఎక్కడికి వెళ్లాడు.? కుమార్తెతో కలిసి తానే దూకి ఆత్మహత్య చేసుకుందా, లేక మరేదైనా జరిగిందా అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.