Andhra PradeshBreaking NewsHome Page Slider

ఆన్లైన్ గేమ్స్ ఆడొద్ద‌న్నందుకు హ‌త్య‌

విశాఖలో దారుణం చోటు చేసుకుంది. క‌ని పెంచి విద్యాబుద్దులు నేర్పిన క‌న్న‌త‌ల్లినే క‌డ‌తేర్చాడు ఓ క‌సాయి కొడుకు.ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దని వారించినందుకు కిరాత‌కంగా హ‌త్య చేశాడు.విశాఖపట్నం మల్కాపురం కోస్ట్ గార్డ్ క్వార్టర్స్ లో అర్ధరాత్రి ఈ హత్య జరిగింది. కోస్ట్ గార్డ్ కమాండెంట్ గా పనిచేస్తున్న బల్బీర్ సింగ్ పెద్ద కుమారుడు అన్మోల్ సింగ్ ఆన్లైన్ గేమ్స్ కు బానిస‌య్యాడు. దీంతో మొబైల్, లాప్టాప్ ను తల్లి త‌న కుమారుడు నుంచి బ‌ల‌వంతంగా లాగేసుకుంది. లాప్టాప్, మొబైల్ తనకు ఇవ్వాలంటూ తల్లితో గొడవపడ్డాడు. ఈ ఘర్షణలో సమీపంలో ఉన్న కత్తి తీసి తల్లి పై విచక్షణ రహితంగా దాడి చేయడంతో తల్లి అక్కడికక్కడే మృతి చెందింది.దీంతో భ‌యంతో ఇంటి తలుపుల‌కు తాళాలు వేసి అక్క‌డ నుంచి ప‌రార‌య్యాడు. విష‌యం తెలుసుకుని ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని సీసి కేమెరాల సాయంతో నిందితుణ్ణి అదుపులోకి తీసుకుని మల్కాపురం పోలీస్ స్టేష‌న్‌కి త‌ర‌లించి విచారిస్తున్నారు.