మునుగోడులో మొదలైన పోలింగ్
తెలంగాణలో ప్రతిష్టాత్మక పోరు మునుగోడు పోలింగ్ మొదలైంది. మునుగోడు అసెంబ్లీ పరిధిలో మొత్తం 2,41,855 మంది ఓటర్లుండగా… వారిలో పురుషులు 1,21, 720 మంది, ఇక మహిళలు 1,20,128 ఉన్నారు. 298 పోలింగ్ బుత్‌లలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 1192 ఈవీఎంలను వినియోగిస్తున్నారు. ఉపఎన్నికల బరిలో మొత్తం 47 మంది నిలిచారు. ఇక పోటీ ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఉండగా.. కాంగ్రెస్ సైతం పరువు కోసం గట్టిగా పనిచేస్తోంది. మునుగోడు ఉపఎన్నికలో మొత్తం 2500 మంది పొలింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. 5 వేలకు పైగా కేంద్ర, రాష్ట్ర బలగాలు ఎన్నికల్లో విధుల్లో పాల్గొంటున్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు. పోలింగ్ అవకతవకలను అడ్డుకునేందుకు వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. సాయంత్రం 6 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.

