Home Page SliderNational

మంత్రి పదవికి ముండే రాజీనామా

మహారాష్ట్ర రాజకీయాలు సంచలనంగా మారాయి. దేవేంద్ర ఫడ్నవీస్ కేబినెట్ లో ఓ వికెట్ పడింది. పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్న ఎన్సీపీ నేత, బీడ్ పార్టీ ఎమ్మెల్యే ధనుంజయ్ ముండే ఇవాళ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. మసాజోగ్ గ్రామ సర్పంచ్ సంతోష్ దేశముఖ్ హత్య కేసులో మంత్రిపై ఆరోపణలు రావడం, ఆయన సన్నిహితుడు వాల్మీక్ కరాద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో సీఎం ఫడ్నవీస్ సూచన మేరకు బీజేపీ దివంగత నేత గోపీనాథ్ ముండే మేనల్లుడైన ధనుంజయ్ ముండే మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన రాజీనామాను ముఖ్యమంత్రి ఆమోదించారు. అనంతరం ముండే రాజీనామా పత్రాన్ని గవర్నర్ సీపీ రాధా కృష్ణన్ కు పంపించారు.