సోషల్ మీడియా డాన్సింగ్ స్టార్‌గా మారిన ముంబయి పోలీస్ మ్యాన్
ప్రతీ ఒక్కరికీ జీవితంలో ఏదో చేయాలని, సాధించాలని ఉంటుంది. కానీ తమ టాలెంట్‌కు తగిన ఉద్యోగాలు లేక దొరికిన దానితో గడిపేస్తూ ఉంటారు. కానీ టాలెంట్ ఉండాలే కానీ సోషల్ మీడియాలో స్టార్స్ అయిపోవచ్చని నిరూపిస్తున్నారు చాలామంది. మామూలు సాదాసీదా ఉద్యోగాలు చేసుకునే వారైనా తమలోని ఏదో ప్రత్యేకతతో పాపులర్ అయిపోతున్నారు. ముంబయికి చెందిన అమోల్ కాంబ్లి అనే ఈ పోలీస్ కానిస్టేబుల్ కూడా అంతే. ప్రొఫెషనల్ డాన్సర్‌లా స్టెప్పులు వేస్తూ సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయిపోయాడు. ఇప్పుడు అతని ఇన్‌స్టాగ్రామ్‌కు లక్షల్లో ఫాలోయర్స్ ఉన్నారు. దేశసేవ కోసం నాఉద్యోగం. దిల్ కి సేవ చేయడానికి నా డాన్స్ అంటూ క్యాప్షన్స్ ఇస్తూ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు అమోల్.

