ముంబై ఇండియన్స్ సరికొత్త రికార్డు
ఈ IPL సీజన్ ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది. ఈ సీజన్ IPLలో జట్టుల హోరాహోరి పోరులో “చివరికి నిలిచేదెవరు..ట్రోఫీని గెలిచేదెవరు” అని దేశమంతా వేయి కళ్లతో ఎదురు చూస్తుంది. ఈ నేపథ్యంలో ఇండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ సారధ్యం వహించిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో వరుస విజయాలతో అదరగొడుతుంది. ప్రత్యేకంగా ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ టీమ్ ఓ అరుదైన రికార్డును నెలకొల్పింది. అదేంటంటే ఇప్పటి వరకు జరిగిన IPL సీజన్ మ్యాచుల్లో ఒక జట్టుపై అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించింది. నిన్న కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ముంబై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఈసారి IPLతో ఈ టీమ్ ఏకంగా 23 సార్లు కోల్‌కతాను ఓడించిన జట్టుగా నిలిచింది. మరోవైపు రోహిత్ శర్మ ఒక జట్టు(KKR)పై అత్యధిక పరుగులు(1,040) చేసిన బ్యాటర్‌గా నిలిచాడు.

