నిర్లక్ష్యం వల్లే ముంబై బోటు ప్రమాదం..
ముంబైలోని నీల్‌కమల్ ఫెర్రీ బోట్ అరేబియా సముద్రంలో తీవ్ర విషాదం నింపింది. అక్కడ గేట్ వే ఆఫ్ ఇండియా నుండి ప్రసిద్ధ ఎలిఫెంటా కేవ్స్‌ను చూడడానికి వెళ్తున్న పర్యాటకుల నౌక నీల్ కమల్ ఫెర్రీ బోటును నౌకాదళానికి చెందిన స్పీడ్ బోటు ఢీ కొట్టింది. బోటు బోల్తా పడడంతో అందరూ సముద్రంలో పడ్డారు. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులు కొందరు నిర్లక్ష్యం వహించి, లైఫ్ జాకెట్లు ధరించలేదు. దానితో 13 మంది సముద్ర జలాల్లో మునిగి మరణించారు. లైఫ్ జాకెట్లు ధరించిన వారు సముద్రంలో తేలియాడారు. ఇంతలో నేవీ, కోస్ట్‌గార్డ్, మెరైన్ పోలీసు విభాగాల సిబ్బంది హుటాహుటిన అక్కడకు వచ్చి 99 మందిని రక్షించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన 13 మందిలో 3 స్పీడ్ బోట్‌లోని నౌకాదళ సిబ్బంది, 10 మంది ఫెర్రీ ప్రయాణికులు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షలు సీఎం సహాయ నిధి నుండి అందిస్తున్నట్లు సీఎం ఫడ్నవీస్ తెలిపారు. కొందరి ఆచూకీ లభించడం లేదని, వారిని గాలిస్తున్నట్లు తెలిపారు.