ములాయం సింగ్ యాదవ్ కన్నుమూత
ములాయం సింగ్ యాదవ్ కన్నుమూత. సమాజ్ వాదీ పార్టీ కురువృద్ధుడు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి ములాయం సింగ్ యాదవ్ కొద్ది సేపటి క్రితం మృతి చెందారు. ములాయం సింగ్ యాదవ్ 1939లో జన్మించారు. దేశ రాజకీయాల్లో తనదైన పాత్ర పోషించారు. అనారోగ్యంతో గత కొద్ది రోజులుగా ములాయం సింగ్ యాదవ్ గుర్‌గావ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ సభ్యుడు. సమాజ్‌వాదీ పార్టీ SP వ్యవస్థాపకుడు. మూడుసార్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ములాయం సింగ్ యాదవ్ పనిచేశారు. 1970ల తర్వాత సామాజిక, రాజకీయ చైతన్యంతో UP రాజకీయాలను శాసించారు. సోషలిస్టు నాయకుడిగా వెలుగొందుతున్న ములాయం.. యూపీలో కాంగ్రెస్ బలహీనపడటంతో తన స్థాయిని పెంచుకున్నారు. ఓబీసీ అగ్రనేతగా స్థిరపడ్డారు. 1989లో UP 15వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో చిత్తయ్యింది. నాటి నుంచి నేటి వరకు యూపీలో కాంగ్రెస్ పార్టీ దారుణమైన పరిస్థితిలో కూరుకుపోయింది.

