Andhra PradeshHome Page Slider

ఆ పార్టీలోకి ముద్రగడ కుమార్తె

వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి జనసేన పార్టీలోకి చేరనున్నారు. నేటి సాయంత్రం 4 గంటలకు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆమె జనసేన పార్టీ తీర్థం పుచ్చుకుంటారు. పవన్ ఆమెకు కండువా కప్పి ఆహ్వానిస్తారు. ఆమెతో పాటుగా తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు నుండి పలువురు నేతలు జనసేనలోకి చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.