పవన్‌కు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం బుద్ది చెపుతూ లేఖ
పవన్‌కు బుద్ది చెపుతూ, సలహాలు ఇస్తూ కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం లేఖ వ్రాసారు. పవన్ వాడుతున్న భాష, వ్యాఖ్యలు అంత బాగోలేవని, పవన్‌కు ఇలాంటి మాటలు మంచిది కాదని, దుర్భాషలాడడం, ఎమ్మెల్యేలను తిట్టడం, రౌడీలా ప్రవర్తించడం, ఒక రాజకీయనాయకుడిగా ఎదగడానికి అడ్డుగోడలుగా నిలుస్తాయని ఈ లేఖలో తెలిపారు. ఎంత మందిని తొక్కతీసారు, నార తీసారు అని ప్రశ్నించారు. ద్వారంపూడి దొంగ అయితే, రెండుసార్లు ఎలా గెలుస్తారంటూ కౌంటర్ వేశారు. మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోమంటూ,ఏపీకి ప్రత్యేక హోదా, స్టీల్‌ప్లాంట్‌పై ఉద్యమించండి అన్నారు. కాపు రిజర్వేషన్ కోసం ఉద్యమాలు చేసి, రాజకీయంగా ఎదుగుతున్నారని వారాహి యాత్రలో పవన్ చేసిన వ్యాఖ్యలపై కూడా ముద్రగడ మండిపడ్డారు. తాను కులాన్ని అడ్డుపెట్టుకుని ఎదగలేదని,నేను వదిలేసిన కాపు ఉద్యమాన్ని బలమైన నేతగా మీరెందుకు ఉద్యమాలు చేయకూడదు అని ప్రశ్నించారు.
