ఈటల రాజేందర్‌కు సంఘీభావం తెలిపిన ముదిరాజ్ సంఘం నేతలు
వరంగల్ వెళ్తున్న ఈటల రాజేందర్‌ని జనగామ, వెంకటేశ్వర గార్డెన్స్ లో కలిసి సంఘీభావం తెలిపారు ముదిరాజ్ సంఘం నేతలు. ఈ సమావేశంలో ఈటల వారితో మాట్లాడారు. హుజూరాబాద్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి తనపై చేసిన కుట్రను వారికి వివరించారు. వారు కూడా కరీంనగర్, వరంగల్ సీపీలకు ఈ ఘటనపై కంప్లైంట్ చేశామని తెలియజేశారు. గతకొన్న రోజులుగా ఒక సైకో mlc ఆన్ని వర్గాల ప్రజలను తిట్టడం, కొట్టడం చేస్తున్నారని మండిపడ్డారు. కక్షతో అక్రమకేసులు పెట్టించడం, కొట్టించడం దాన్ని సెల్ ఫోన్‌లో చూపించడం చేస్తున్నారు. సర్పంచ్ ను జైల్లో పెట్టించారు. తన లాంటి వారి మీద కూడా దాడులకు ప్లాన్ చేస్తున్నారు. సుపారి ఇచ్చాం ఏదో ఒక రోజు చంపేస్తాం అని మాట్లాడుతున్నారు.

హుజూరాబాద్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి
సహనానికి కూడా హద్దు ఉంటుంది. ఓపిక, సహనం, మంచితనం అసమర్థతగా చుడవద్దని హెచ్చరించారు ఈటల. అతనికి ఇంత బలం రావడానికి కారణం పదవి మాత్రమే కాదని, కేసిఆరే స్వయంగా ఇబ్బంది పెట్టాలి అని అతనికి మద్దతు తెలుపుతున్నారని విమర్శించారు. నిజాయితీ ఉంటే విచారణ జరిపి చర్యలు తీసుకోమని,ఈటల చరిత్ర తెరిచిన పుస్తకం అనీ తాను ఎవరికీ హాని చెయ్యలేదు, చెయ్యను అని ధీమా వ్యక్తం చేశారు. ఈ MLC బర్తరఫ్ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారన్నారు. కాగా ఐపీఎస్ ఆఫీసర్‌ను కేటీఆర్ విచారణకు ఆదేశించారని, తన రక్షణకై చర్యలు తీసుకోమన్నారని తెలిసిందన్నారు. ఈ సమావేశంలో జనగామ జిల్లా బీజేపీ అధ్యక్షుడు దశ్మంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు మద్దెల సంతోష్, ముదిరాజ్ సంఘం నాయకులు డా. మాచర్ల బిక్షపతి, కట్ల సదానందం ఇంకా పలువురు నాయకులు ఉన్నారు.

