Home Page SliderTelangana

అసెంబ్లీ ఎన్నికల్లో ముదిరాజ్ ల సత్తా ఏంటో కేసీఆర్ కు చూపిస్తాం

ముదిరాజ్ ఆత్మగౌరవ సభ హక్కుల కోసం గళం ఎత్తింది. సాక్షిగా దశాబ్దాలుగా జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించింది. బ్యాంకు రాజకీయాలు చేస్తున్న పార్టీలకు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలంటూ ముదిరాజ్ జాతికి ఒక సందేశాన్ని పంపించింది. 33 జిల్లాల నుంచి ముదిరాజ్ బిడ్డలు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరయ్యారు. అన్ని పార్టీల్లోని ముదిరాజ్ ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొని వచ్చే ఎన్నికల్లో ముదిరాజ్ బిడ్డలకు మాత్రమే ఓటేయాలని పిలుపునిచ్చారు. హుజురాబాద్ ఎమ్మెల్యే, తెలంగాణ బిజెపి ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల కీలక ప్రసంగం చేశారు. ఈటల రాజేందర్, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. జై ముదిరాజ్ నినాదాలతో పరేడ్ గ్రౌండ్స్ మార్మోగింది. ముదిరాజ్ హక్కులు.. సాధించుకునేందుకు రాజకీయ పోరాటాలే శరణ్యమన్నారు నేతలు.


ఈ కార్యక్రమంలో ఈటల తో పాటుగా, కుల సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మాజీ మంత్రి పి. చంద్రశేఖర్, బిత్తిరి సత్తి అంబర్ పేట్ శంకర్, నీలం మధు, పులిమామిడి రాజు కొలిపాక శ్రీను, సంతోష్ ఇతర నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు డాక్టర్ చొప్పర శంకర్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి శంకర్ ము ఆధ్వర్యంలో.. ముదిరాజ్ ఆత్మగౌరవ సభ పెరేడ్ గ్రౌండ్స్ లో లక్షలాది మంది సమక్షంలో ఘనంగా జరిగింది. ముదిరాజ్ ఆత్మగౌరవ సభలో గర్జించిన ముదిరాజ్ సోదరులు అధికారం కోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలని నేతలు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో ముదిరాజ్ ల సత్తా ఏంటో చూపించాలని నినదించారు. అధికార బీఆర్ఎస్ పార్టీ ఒక్క ముదిరాజ్ అభ్యర్థి కూడా సీట్ ఇవ్వకపోవడం దారుణమంటూ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక జై ఈటల అంటూ మార్మోగిన పరేడ్ గ్రౌండ్స్ మార్మోగాయి.


ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో జరిగిన ముదిరాజుల ఆత్మగౌరవ సభలో హుజురాబాద్ ఎమ్మెల్యే, తెలంగాణా బిజెపి తెలంగాణ నిర్వహణ కమిటీ చైర్మన్ రాజేందర్ కీలక ఉపన్యాసం చేశారు.
సభకు పోవద్దంటూ పెద్దలు హుకుం జారీ చేశారు. ఆటోలు మాట్లాడుకుంటే ఆటోలు బంద్ చేశారు సభ జరగనివ్వద్దని కుట్రలు చేశారని దుయ్యబట్టారు. బస్సులు మాట్లాడుకుంటే బస్సులు బంద్ చేశారని.. సభకు వెళ్తే ఇల్లు, పెన్షన్ రాదని, సంఘం భవనాలు రావంటూ భయపెట్టారన్నారు. ఐనప్పటికీ పరేడ్ గ్రౌండ్ లో ముదిరాజ్ ల ఆత్మగౌరవ సభకు లక్షలాది మంది వచ్చారన్నారు.


ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ముదిరాజ్ జాతిని ఏ రాజకీయ పార్టీ కూడా పట్టించుకోలేదని బీసీ D నుండి A లోకి మార్చాలని కోరుతున్నా, ఏ ఒక్కరూ ముదిరాజ్ జాతికి న్యాయం చేయాలని అనుకోకపోవడం ఘోరమన్నారు ఈటల. ఎమ్మెల్యే అయిన మొదటి రోజు నుండి ముదిరాజ్ హక్కుల కోసం కొట్లాడుతున్నానన్నారు. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2008 జడ్చర్ల సభలో ముదిరాజ్ లను డి నుండి ఎ కు మారుస్తా అని ప్రకటించారు. అదే సభలో మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్ ప్రకటించారు. బీసీ A రిజర్వేషన్, ఒక్క సంవత్సరం మాత్రమే అమలయ్యిందన్నారు.


మైనారిటీ వాళ్లు ఏడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి సుప్రీంకోర్టులో వారు గెలిచారు. మనకు ఎవరు లేక పట్టించుకోవడం లేదని. ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ A కోసం డిసెంబర్ 18, 2016 న నిజాం కాలేజీలో పెద్ద సభ పెట్టాం….7 సంవత్సరాలు గడిచినా సమస్య పరిష్కారం కాలేదన్నారు ఈటల. ఇంత అన్యాయం జరుగుతుంటే పట్టించుకోని సీఎం మనకు అవసరమా అని ఈటల ప్రశ్నించారు. సీఎం గారు మీకు సోయి ఉందా అంటూ ఈటల దుయ్యబట్టారు.


మందిది మాకు కావాలని అడగలేదు, మాది మాకు కావాలని ఆడుగుతున్నామన్నారు ఈటల. నీలం మధు, శ్రీనివాస్, పులిమామిడి రాజు లేరా ? ఎందుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని ఈటల మండిపడ్డారు. ఒకసారి నాకు అవకాశం ఇస్తే ఈనాటి వరకు ఓడిపోలేదన్నారు. తాను పొత్తుల సద్దిలాంటి వాడిని… మాదిగ మీటింగ్ కి పోతే రాజేందర్ మాదిగని, లంబాడా వాళ్ళ మీటింగ్ పోతే రాజేందర్ నాయక్ అని పిలిచేవారు, అణగారిన వర్గాల వారు ఏదో ఒక రోజు మా జీవితాలు మీ చేతుల్లో పడకపోతాయా బతుకులు మారకపోతాయా అని మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నారు. 40 రోజులు అసెంబ్లీలో మీటింగ్ పెట్టి అన్నికులాలు ఎలా బాగుపడాలో ప్రణాళిక తయారుచేసిన వాడు ఈటల అని.. రాజేందర్ గుర్తు చేశారు.
ముదిరాజ్ జనాభా 11 శాతమని.. లెక్కల ప్రకారం 20 వేల కోట్ల బడ్జెట్ ఇవ్వాలన్నారు. కానీ చేప పిల్లల పేరుతో మాకు ఇచ్చేది 500 కోట్లు విదిల్చారని… ఇదేం మర్యాద అని మండిపడ్డారు. వేదిక మీద నుండి డిమాండ్ చేస్తున్న చేపపిల్లలు కాదు డబ్బులు ఇవ్వండి మేమే కొనుక్కుంటామన్నారు.


ప్రాజెక్టుల్లో, చెరువులలో సంపూర్ణ అధికారం మాత్స్యకారులకు ఇవ్వాలని ఈటల డిమాండ్ చేశారు. ప్రతి మత్స్యకారునికి సభ్యత్వం ఇవ్వాలన్నారు. కేజీ కల్చర్ పద్దతిలో చేపలు పెంచేందుకు యువతకు నిధులు ఇవ్వాలన్నారు. ప్రాజెక్టుల్లో సోలార్ పానెల్స్ పెట్టి మా ఉపాధి పోగొడితే వాటిని పగలగిలొట్టుడు ఖాయమని ఈటల హెచ్చరించారు. జనాభా ప్రకారం 11 ఎమ్మెల్యే సీట్లు ముదిరాజ్ లకు ఇవ్వాలన్నారు.
అరే మీరు ఏం చేయగలరు అని బీఆర్ఎస్ ఒక్క సీటు ఇవ్వకుండా మన ఆత్మగౌరవం మీద దెబ్బకొట్టిందన్నారు. ముదిరాజ్ జాతి అంతా స్పందించిందన్నారు. మామీద నమ్మకం లేనప్పుడు మేమెందుకు మీకు ఓట్లు వేయాలని బీఆర్ఎస్ ముదిరాజ్ లు యుద్ధం ప్రకటించారన్నారు. బీసీలు 52 శాతం జనాభాకు 9 మంత్రి పదవులు రావాలి కానీ ఇవ్వడం లేదని.. తిరగబడే సమయం ఆసన్నమైందన్నారు. దళిత ముఖ్యమంత్రి ఇవ్వకుండా కేసీఆర్ ద్రోహం చేసి… గిరిజనులకూ అన్యాయం చేశారు. చేపపిల్లలు ఇచ్చారని జేజేలు కొడితే మన బతుకులు మారవన్నారు. ముదిరాజ్ జాతిని చూసి మిగిలిన జాతులు అన్నీ కదం తొక్కారన్నారు. అన్ని జాతులను ఐక్యం చేసే బాధ్యత మన చేతుల్లో ఉందన్నారు. రాజ్యాధికారం రావాలంటే ఓపికగా ఉండాలన్న ఈటల, ఎన్నాళు ఈ బానిస బతుకులు… పిడికిలి బిగించాలన్నారు.

ఓట్లు మావే సీట్లు మావే…
ఇదే మన నినాదం అందుకోవాలని ఈటల పిలుపునిచ్చారు.
ముదిరాజ్ ఆత్మగౌరవ సభలో ప్రసంగించిన మాజీ మంత్రి పి చంద్రశేఖర్ అందరం కలిసికట్టుగా పోరాడితే సాధించలేనిది ఏది లేదని పిలుపునిచ్చారు పి చంద్రశేఖర్ ఇటీవల రాష్ట్రంలో ఇంతటి పెద్ద సభ ఇటీవల జరగలేదని ఒక కులం పిలుపుతో ఇంత ఘనంగా సభ జరగడం గొప్ప విషయం అని చెప్పారు. తెలంగాణలో ముఖ్యమంత్రి అవ్వడానికి కావాల్సిన అర్హతలన్నీ ఈటల రాజేందర్ కు ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. కెసిఆర్ ముదిరాజులను అనవసరంగా కేలుకున్నారని.. హక్కుల కోసం పోరాడితే పోయేదేమీ లేదని చంద్రశేఖర్ చెప్పారు. 119 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా ముదిరాజ్ బిడ్డ దొరకలేదా అంటూ బిఆర్ఎస్ నేత నీలం మధు ముదిరాజ్ సీఎం కేసీఆర్ ను సభ సాక్షిగా ప్రశ్నించారు. ముదిరాజ్ లు ఆత్మగౌరవ సభ ఇంకెన్నాళ్లు చేసుకోవాలంటే ఆవేదన వ్యక్తం చేశారు జర్నలిస్ట్ బిత్తిరి సత్తి. తెగిస్తే హక్కులు సాధించుకోవచ్చని అందుకు కుల సంఘాలు ప్రణాళిక రూపొందించాలని ఆయన పిలుపునిచ్చారు. ముదిరాజ్ బిడ్డలు హక్కులు సాధించుకునే వరకు పోరాడాలని అంబర్ పేట శంకర్ విజ్ఞప్తి చేశారు. వచ్చే ఎన్నికల్లో ముదిరాజ్ లకే ఓటేయాలని ముదిరాజ్ లకు అన్యాయం చేసిన వారిని తరిమికొట్టాలని సభా వేదిక నుంచి నాయకులు ముదిరాజ్ సోదరులకు పిలుపునిచ్చారు.