Andhra Pradesh

మున్సిపాలిటీల్లో రోడ్లపై పశువులు,పెంపుడు కుక్కలను వదలకూడదు

మున్సిపాలిటీల్లో రోడ్లపై పశువులు,పెంపుడు కుక్కలను వదలడం పై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. పశువులు,పెంపుడు కుక్కల వలన వాహనదారులు, పాదచారులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో పెంపుడు జంతువులను రోడ్లపైకి వదలకుండా యజమానులు జాగ్రత్తలు తీసుకోవాలని అలా జాగ్రత్తలు తీసుకొని పక్షంలో రోడ్లపై సంచరించే పశువులు,పెంపుడు కుక్కలను మున్సిపాలిటీకి తరలించి యజమానులకు జరిమానా వేస్తామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ హెచ్చరించారు.