గురుకులాల్లో ఎంసెట్, నీట్ కోచింగ్..పొన్నం
ప్రజా పాలన లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తమ ప్రభుత్వం విద్య కు ప్రథమ స్థానం కల్పిస్తున్నామని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. అన్ని గురుకులాల్లో ఎంసెట్ ,నీట్ కోచింగ్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. గురుకులాల్లో కూడా పదవ తరగతి ఉత్తీర్ణత కాగానే నేరుగా ఇంటర్మీడియట్ కి వెళ్ళేలా విద్యాశాఖకు ఆదేశాలు ఇచ్చారు. గురుకులాల్లో ఇంటర్మీడియట్ కంప్యూటర్ తో పాటు అన్ని కోర్స్ లు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ వచ్చిన తరువాత మౌలిక సదుపాయాల విషయంలో ఇబ్బందులు ఉండవన్నారు. సంవత్సరానికి 5-6 లక్షలు ఫీజ్ కట్టిన అలాంటి స్కూల్ లు ఉండవని ముఖ్యమంత్రి గారి ముందస్తు దృష్టితో కొత్తగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లు వస్తున్నాయన్నారు ఒక్కో విద్యార్థి ఒక్కో అంశంలో నిపుణులుగా ఉండేలా ప్రోత్సహించాలని సూచించారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ వచ్చిన తరువాత మౌలిక సదుపాయాల విషయంలో ఇబ్బందులు ఉండవన్నారు. సంవత్సరానికి 5-6 లక్షలు ఫీజ్ కట్టిన అలాంటి స్కూల్ లు ఉండవని ముఖ్యమంత్రి గారి ముందస్తు దృష్టితో కొత్తగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లు వస్తున్నాయన్నారు ఒక్కో విద్యార్థి ఒక్కో అంశంలో నిపుణులుగా ఉండేలా ప్రోత్సహించాలని సూచించారు.

