NationalNews

సినిమా రంగంలోకి మిస్టర్‌ కూల్‌

భారత క్రికెట్‌కి ఎన్నో విజయాలు, వరల్డ్‌ కప్‌ అందించిన గ్రేట్‌ క్రికెటర్‌ ధోని త్వరలో సినిమా రంగంలోకి రానున్నాడు. రాబోయే రోజుల్లో సినిమాలు నిర్మించనున్నాడు. తాజాగా దీపావళి నాడు ధోని తన సినిమా ప్రొడక్షన్‌ ఆఫీస్‌ ఓపెన్‌ చేసి తన మొదటి సినిమాని ప్రకటించాడు. తన నిర్మాణ సంస్థకి D ఎంటర్టైన్మెంట్‌ అనే పేరుని పెట్టాడు. చెన్నైలో తన ప్రొడక్షన్‌ ఆఫీస్‌ని ధోని ప్రారంభించాడు. తన మొదటి సినిమాను తమిళ్‌లో నిర్మించనున్నాడు. ఈ సినిమాకి ధోని భార్య సాక్షి సింగ్‌ కథను అందించగా రమేష్‌ తమిళమణి దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ సినిమా ఫ్యామిటీ ఎంటర్టైనర్‌లా ఉండబోతోంది అని ప్రకటించారు. తమిళ్‌తోపాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందు రానుంది.  సాక్షి రాసిన కథను చదివినప్పుడు చాలా స్పెషల్‌గా అనిపించిందన్నారు డైరెక్టర్‌ రమేష్‌. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దేందుకు శాయశక్తులా కృషిచేస్తానన్నారు. అయితే… ఈ సినిమాలో నటించే నటీ నటులు త్వరలోనే మరిన్ని వివరాలు తెలియజేస్తామన్నారు.