Home Page SliderNational

జియోమార్ట్ బ్రాండ్ అంబాసిడర్‌గా Mr. కెప్టెన్ కూల్

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరో టాప్ బ్రాండ్‌కు అంబాసిడర్‌గా మారారు. అదేంటంటే రిలయన్స్ రిటైల్స్‌కు చెందిన ఈ-కామర్స్  ప్లాట్‌ఫామ్ జియోమార్ట్‌కు ధోని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ఈ విషయాన్ని రిలయన్స్ సంస్థ తాజాగా ప్రకటించింది. “విశ్వసనీయతకు మారు పేరుగాగల వ్యక్తిని మా సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడం సంతోషంగా ఉందని తెలిపింది”. అయితే ప్రస్తుతం నాన్-మెట్రో ప్రాంతాల అమ్మకాలలో 60% వాటా కలిగి ఉన్నట్లు వెల్లడించింది. కాగా మహేంద్ర సింగ్ ధోనిని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడంతో రిలయన్స్ మరింతగా వృద్ధి చెందుతుందని ఆశిస్తున్నట్లు రిలయన్స్ సీఈఓ సందీప్ తెలిపారు.