పాక్ మహిళలపై ఎంపీ సంచలన వ్యాఖ్యలు..
జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ వద్ద ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ మహిళలపై బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. వివాహాల ద్వారా పాకిస్తాన్ మహిళలు భారత్‌లో ప్రవేశించడంతో ఉగ్రదాడులు ప్రేరేపితమవుతున్నాయని ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ, “సుమారు 5 లక్షల మంది పాకిస్థానీ యువతులు భారతీయులను పెళ్లి చేసుకుని మన దేశంలోనే నివసిస్తున్నారు. పాకిస్థానీ మహిళలు, అలాగే కొంతమంది పాక్ పురుషులు కూడా భారతీయులను వివాహం చేసుకొని సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నారని దూబే తెలిపారు. వారి వివాహాల వెనుక ఉన్న అసలు ఉద్దేశాలను తప్పనిసరిగా విచారించాలని ఆయన డిమాండ్ చేశారు. వారికి వీసాలు మంజూరు చేసే ప్రక్రియపై కూడా సమగ్ర దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఆశ్చర్యకరంగా, వారికి ఇప్పటివరకు భారత పౌరసత్వం కూడా లభించలేదు” అని పేర్కొన్నారు. దేశం లోపల ఉన్న ఇలాంటి ‘శత్రువులతో’ ఎలా పోరాడాలనే దానిపై ఆలోచించాలని ఆయన వ్యాఖ్యానించారు.

