పురంధేశ్వరిపై నిప్పులు చెరిగిన ఎంపీ విజయసాయిరెడ్డి
పురంధేశ్వరిది నిలకడలేని రాజకీయం. ఆమెకు ఓ నియోజకవర్గం లేదు.. స్వార్ధ, కుటుంబ, సొంత అజెండాతోనే ఆమె రాజకీయం చేస్తున్నారు. ఏపీలో ఉన్న లిక్కర్ బ్రాండ్స్ ఏమున్నాయో నాకు తెలిదు. కానీ, పురంధేశ్వరికి మాత్రం ఎలా తెలుసో? మా పై ఆరోపణలు చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. పురంధేశ్వరి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారు. ఏ మాత్రం సంబంధంలేని ఇద్దరు వ్యక్తులపై ఆరోపణలు చేయడం తగదు. మద్యం విషయంలో నాపై, ఎంపీ మిథున్ రెడ్డిపై లేని పోని ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదన్నారు విజయసాయిరెడ్డి. బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి ఆరోపణలు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని విజయసాయి హితవు పలికారు. లిక్కర్ విషయంలో తనపై, మిథున్ రెడ్డిపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆమెది నిలకడ లేని రాజకీయమని, స్వార్థ, సొంత అజెండాతోనే రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. పురంధేశ్వరికి తెలిసింది ఆమె సామాజిక వర్గం గురించి మాత్రమేనని ఎద్దేవా చేశారు.

