చిలకలూరిపేట మున్సిపాలిటీ స్కాం పై విచారణ చేయాలని మున్సిపల్ శాఖ మంత్రి కి ఎంపీ లావు లేఖాస్త్రం
చిలకలూరిపేట మున్సిపాలిటీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 11 మంది సిబ్బందిపై వేటు పడింది.మరి కొంతమంది పై చర్యలు తీసుకోమని ఉన్నతాధికారులు కోరడంతో మున్సిపల్ అధికారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగి గంగా భవాని అవినీతికి పాల్పడిన రూ. 34,34,397 కుంభకోణమే ఈ పరిణామాలకు దారి తీసింది. ఈ స్కాం ప్రస్తుతం మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఉద్యోగుల మెడకు ఉరితాడుగా మారింది.
సామాన్య ప్రజలకు భరోసా కల్పించేందుకు ఈ అవినీతి భాగోతంపై చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు, నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు స్పందించారు. ఈ కుంభకోణంపై విజిలెన్స్ విచారణకు లేఖ రాయాలని మున్సిపల్ చైర్మన్‌ను కోరారు. ఎమ్మెల్యే,ఎంపీ ల సూచన మేరకు ఈ నెల 12న మున్సిపల్ చైర్మన్ రపానీ , డైరెక్టర్ ఆఫ్ విజిలెన్స్ విభాగానికి చెందిన గంగాభవాని చేసిన కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ లేఖ లో పెర్కోన్నారు.
ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు ఎమ్మెల్యే పుల్లారావు మున్సిపాలిటీలో పారదర్శకత ఉండాలని…ఇలాంటి ఘటనలు ప్రజల్లో నమ్మకాన్ని దెబ్బతీస్తాయని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణకు లేఖ పంపారు. చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయంలో జరిగిన 34 లక్షల కుంభకోణం, మున్సిపాలిటీలో జరిగిన ఇతర అవకతవకలపై వెంటనే సమగ్ర విచారణ జరిపించాలని ఆ లేఖలో ఎంపీ లావు కోరారు. ఈ కుంభకోణంపై విచారణ పూర్తి కావడం ద్వారా దోషులు శిక్షించబడి, ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నారు. మున్సిపల్ అధికారులు మరియు ఉద్యోగులు ఈ విచారణ జరగాలని కోరుకుంటున్నారు
