Andhra PradeshHome Page Slider

ఎంపీ కేశినేని నాని వస్తే ఆహ్వానిస్తాం: వైసీపీ ఎంపీ

టీడీపీ ఎంపీ కేశినేని ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా విజయవాడ ఎంపీ టికెట్ ఏ పిట్టల దొరకు ఇచ్చినా నాకు అభ్యంతరం లేదన్నారు. ప్రజలు కోరుకుంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటి చేసి గెలుస్తానేమో అని ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలను వైసీపీ పరిగణలోకి తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఇదే సమయంలో వైసీపీ ముఖ్య నేత..రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. కేశినేని నాని వైసీపీలోకి వస్తే ఆహ్వానిస్తామని చెప్పుకొచ్చారు. 30 మంది అధికారపక్ష ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని టీడీపీ ప్రచారం పైనా స్పందించారు. దీనిని టీడీపీ మైండ్ గేమ్ గా కొట్టి పారేసారు. ఇదే సమయంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ చేసిన కామెంట్స్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. మాజీ మంత్రి దేవినేని ఉమా వైసీపీ అనకూల శత్రువుగని వ్యాఖ్యానించారు. నందిగామలో ఉమా ప్రచారం చేస్తే రెండో సారి కూడా జగన్మోహన్ రావు ఎమ్మెల్యేగా గెలుస్తారని కృష్ణప్రసాద్ వెల్లడించారు.