ఎంపీ ఈటల ఫేస్ బుక్ హ్యాక్
టిజి: మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఫేస్ బుక్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఆయన ప్రొఫైల్‌తో పలువురిని డబ్బులు అడుగుతూ మెసేజ్‌లు పెడుతున్నారు. ఈ విషయం ఆయన దృష్టికి వెళ్లడంతో వెంటనే స్పందించారు. ఎవరూ మోసపోయి డబ్బులు పంపవద్దని ఈటల సిబ్బంది తెలిపారు. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు.