సొంత పార్టీపై ఎంపీ విమర్శలు
సొంత పార్టీపై ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శలు గుప్పించారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటేసిన ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు వేయడం లేదని ఎంపీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వమే వస్తుదన్న పరిస్థితి నుంచి 8 సీట్లే ఎందుకొచ్చాయని ప్రశ్నించారు. సమస్య ఎక్కడో లేదని.. తమ పార్టీలోనే ఉందని అన్నారు. నిజామాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రజలు ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నా.. బీజేపీ ప్రభుత్వం ఇక్కడ ఎందుకు రాదు.. ఎట్ల రాదు. జీహెచ్ఎంసీలో 48 డివిజన్లు గెలిచి.. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా పొందలేకపోయినం. లోకసభ ఎన్నికల్లో కాషాయపార్టీకి ఓటేసిన ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు వేస్తలేరు.. జిమ్మేదారి ఎవరు? రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే.. ఎవరిని చెప్పు కింద తొక్కి పెట్టాలో మాకు తెలుసు’ అని అన్నారు.