Andhra PradeshHome Page Slider

కంచే చేను మేస్తే దిక్కెవరు? సీబీఐపై అవినాష్ రెడ్డి తీవ్ర విమర్శలు

కడప ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. మళ్లీ పిలిచినప్పుడు విచారణకు రావాలని సీబీఐ కోరిందన్నారు అవినాష్ రెడ్డి. విచారణ తప్పుదోవ పడుతుందని… రెండు సార్లు ఆడియో, వీడియో రికార్డ్ చేయాలని అడిగినా… సీబీఐ పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించానన్నారు. తప్పుడు సాక్ష్యాలతో టార్గెట్ చేస్తున్నారన్నారు. కట్టు కథని అడ్డుపెట్టుకుని విచారణ చేస్తున్నారని సీబీఐపై మండిపడ్డారు అవినాష్ రెడ్డి. ఎన్ని ఆరోపణలు చేసినా మౌనంగా ఉన్నానన్న అవినాష్ రెడ్డి… తాను ఎలాంటి తప్పు చేయలేదని.. ఎంత దూరమైన వెళ్లి న్యాయపోరాటం చేస్తానన్నారు. గూగుల్ టేకౌట్ అన్నది లేదని.. కేవలం టీడీపీ టేకౌట్ మాత్రమే ఉందని దుయ్యబట్టారు. విచారణలో ల్యాప్‌ వాడుతున్నారని… రికార్డ్ చేస్తున్నారో లేదో తెలియదన్నారు. కంచే చేను మేసే విధంగా సీబీఐ వ్యవహరిస్తోందన్నారు.

మర్డర్ పెద్ద గేమ్ అంటూ కొత్త ట్విస్ట్ ఇచ్చారు అవినాష్ రెడ్డి. లంచ్ మోషన్ పిటిషన్ వేసిన వెంటనే మా సోదరి సునీతకు సీబీఐ సమాచారం ఇచ్చిందన్నారు. 2006 నుంచి వివేకాకు ఓ మహిళతో సంబంధం ఉందని… షేక్ షహన్ షా అనే అబ్బాయి వారికి పుట్టాడన్నారు. కొందరు కోర్టును తప్పుదోవపట్టిస్తున్నారన్నారు. వివేకా ఇంట్లో డాక్యుమెంట్ల కోసం వెతికారని… ఆస్తి తగాధాల కోసమే హత్య జరిగిందని భావిస్తున్నానన్నారు. కానీ సీబీఐ మాత్రం కట్టు కథలు అల్లుతోందన్నారు. హత్య జరిగిన ప్రాంతంలో దొరికిన లేఖను.. సునీతమ్మ భర్త మధ్యాహ్నం వరకు ఎవరికీ ఇవ్వలేదన్నాడు. ఘటనా స్థలానికి వెళ్లమని చెప్పింది వారేనన్నారు ఎంపీ అవినాష్ రెడ్డి.