Andhra PradeshHome Page Slider

నేడు సీబీఐ ముందుకు ఎంపీ అవినాష్ రెడ్డి

ఏపీలో వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో సిబిఐ వేగంగా అడుగులేస్తోంది. విచారణ హైదరాబాదుకు మారిన నేపథ్యంలో కేసుకు సంబంధించిన కీలక పత్రాల కూడా కడప నుంచి సిబిఐ కోర్టుకు తరలించిన విషయం తెలిసిందే. దీంతో దూకుడు పెంచిన కేంద్ర దర్యాప్తు సంస్థ అధికార పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి విచారించేందుకు సిద్ధమవటం సంచలనం రేపుతోంది. దీనిలో భాగంగా ఇప్పటికే నోటీసులు అందుకున్న అవినాష్ రెడ్డి శనివారం సిబిఐ ఎదుట హాజరుకానున్నారు. మధ్యాహ్నం 3:00 లోపు హైదరాబాద్ సిబిఐ కార్యాలయంలో విచారణకు ఎంపీ హాజరైయైందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వివేకానంద రెడ్డి హత్య కేసులో పలు అనుమానాలపై ఆయనను సిబిఐ అధికారులు ప్రశ్నించనున్నారు. అందుకోసం ప్రత్యేకంగా ప్రశ్నావళిని కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే అప్రూవర్ గా మారిన దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా సిబిఐ నోటీసులు జారీ చేసింది. దీంతో వివిధ అంశాలకు సంబంధించి సుదీర్ఘంగా అధికారులు విచారించనున్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దాదాపుగా నాలుగేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. హత్య అనంతరం పరిణామాలన్నీ సంచలనాలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వివేకా కేసు విచారణలో ఎంపీ అవినాష్ రెడ్డిని సిబిఐ విచారించడం ముందు ముందు కీలక పరిణామాలు చోటు చేసుకోవచ్చని అంటున్నారు. అవినాష్ రెడ్డి శనివారం సిబిఐ విచారణకు హాజరవుతున్న క్రమంలో మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారన్న సమాచారం రాజకీయ వర్గాల్లో మరింత చర్చనీయాంశంగా మారింది.