ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ పై నేడు విచారణ
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ విచారణ మళ్లీ వాయిదా పడింది. ఎంపీ బెయిల్ పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మద్యంతర ఉత్తర్వులు సుప్రీంకోర్టు రద్దు చేసిన మీదట అవినాష్ రెడ్డి అరెస్టుపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే బెయిల్ పై తుది నిర్ణయం తెలంగాణ హైకోర్టుదేనని సుప్రీం కోర్టు తేల్చి చెప్పటంతో దీనిపై విచారణ ఇదిగో అదిగో అన్నట్లు సాగుతోంది. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి బెయిల్ ఉత్తర్వులపై ఆసక్తి రేపుతుంది. సోమవారం జరగాల్సిన విచారణ సుప్రీంకోర్టు ఉత్తర్వులు కాపీ అందని కారణంగా మంగళవారానికి వాయిదా పడింది. కాగా మంగళవారం విచారణ జరపాలని న్యాయవాదుల కోరగా బుధవారం వాదనలు వింటామని వాయిదా వేసింది. దీంతో అవినాష్ బెయిల్ పిటిషన్ పై బుధవారం విచారణ జరగాల్సి ఉండగా జాబితాలోనే లేని కారణంగా విచారణను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. గురువారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు విచారణ చేపడతామని న్యాయమూర్తి తెలిపారు. దీంతో వివేక హత్య కేసులో అవినాష్ బెయిల్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.