Home Page SliderNational

మోనాలిసాకు సినిమా ఛాన్స్.. ఫస్ట్ మూవీ ఇదే..!

సోషల్ మీడియా సెన్సేషన్ మోనాలిసా భోస్లే ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళా.. మోనాలిసా జీవితాన్నే మార్చేసింది. మొన్నటి వరకు సాధారణ కుటుంబంలో ఒక వ్యక్తిగా ఉన్న ఈ 16 ఏళ్ల మోనాలిసా.. కొన్ని రోజుల వ్యవధిలోనే బాలీవుడ్ లో అడుగుపెట్టేందుకు రెడీ అయింది. కుంభమేళాలో పూసల దండలు, రుద్రాక్షలు అమ్ముకుని జీవితం సాగించే మోనాలిసా ఇప్పుడు తన ఫస్ట్ మూవీకి సైన్ చేసింది. దీనంతటికీ కారణం సోషల్ మీడియానే. ఓవర్ నైట్ ఇండియా వైడ్ గా పాపులర్ అయిన విషయం తెలిసిందే.

ఆమె అందానికి ఫిదా అయిన చాలా మంది నెటిజన్స్.. తనలో హీరోయిన్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని, తను హీరోయిన్ అవ్వాలని కోరుకున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు సనోజ్ మిశ్రా.. ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ అనే చిత్రంతో ఆమెను హీరోయిన్ గా పరిచయం చేయబోతున్నట్టు ప్రకటించాడు. తాజాగా ఆయన స్వయంగా మోనాలిసా ఇంటికి వెళ్లి, ఆమె కుటుంబాన్ని ఒప్పించి ఈ మూవీకి సైన్ చేయించాడు. తెరపై ఆమెను అద్భుతంగా చూపించబోతున్నానని, షూటింగ్ కు ముందే ముంబైలో ఆమెకు యాక్టింగ్ ట్రైనింగ్ ఇవ్వబోతున్నట్టు చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సనోజ్ మిశ్రా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. . ఏప్రిల్ లో షూటింగ్ ప్రారంభించి అక్టోబర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావ్ సోదరుడు అమిత్ రావ్ ఇందులో హీరోగా నటించబోతున్నట్టు తెలుస్తోంది.