సీఎం జగన్ తో మోటివేషనల్ స్పీకర్ నిక్ భేటీ
ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ నిక్ వుజిసిక్ బుధవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ ను కలవడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. ఇప్పటికే 78 దేశాల్లో పర్యటించానని జగన్ అత్యున్నత లక్ష్యం కోసం ఉన్నతమైన ఆశయంతో పని చేస్తున్నారని విద్యా వైద్య వ్యవసాయ రంగంలో అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తున్నారని ప్రశంసించారు. రాష్ట్రంలో 45 వేల ప్రభుత్వ స్కూళ్లను ప్రపంచస్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నారన్నారు.