home page sliderHome Page SliderTelangana

కన్న కొడుకును గొడ్డును బాదినట్లు బాదిన తల్లి

తెలంగాణ జగిత్యాల కేంద్రంలోని తులసినగర్ లో దారుణం జరిగింది. కన్న కొడుకును గొడ్డును బాదినట్టు బాదింది ఓ తల్లి. ప్రతీరోజూ రమ పిల్లవాణ్ణి చితకబాదుతుండటంతో పక్కింటి వారు వీడియోలు తీసి సఖి సెంటర్ లో ఫిర్యాదు చేశారు. పిల్లవాణ్ని సఖి సెంటర్ కు తరలించారు. రమ భర్త ఆంజనేయులు దుబాయ్ లో ఉంటున్నాడు. తల్లి దాష్టీకాన్ని భరించలేక అధికారులకు ఫిర్యాదు చేశారు. తల్లి రమకు డీసీపీఓ హరీశ్ నేతృత్వంలో కౌన్సిలింగ్ ఇప్పించారు. అనంతరం చిన్నారిని అమ్మమ్మ, తాతయ్యకు అప్పగించారు. ఈ రోజు దుబాయ్ నుంచి రమ భర్త ఆంజనేయులు ఇండియాకి చేరుకున్నాడు. రమ కుటుంబ సమస్యలతో మానసికంగా ఇబ్బందులు పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. అధికారులు రమకి నేడు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.