Home Page SliderInternational

కూతురి కన్నా.. అమ్మ ఏడాదే పెద్ద !

ఏంటి? కుమార్తె కన్నా తల్లి ఏడాదే పెద్దా? అని ఆశ్చర్యపోతున్నారా? అవును, మీరు చదివింది నిజమే! ఐవీఎఫ్ చేసిన పిండాలు మిగిలినప్పుడు వాటిని ‘నేషనల్ ఎంబ్రియో డొనేషన్ సెంటర్’లో ఫ్రీజ్ చేస్తారు. ఈ సంస్థ ప్రోత్సాహం మేరకు సంబంధిత తల్లిదండ్రులు వాటిని పిల్లలు లేనివారికి దానమిస్తారట. అలా తల్లిదండ్రులైన వారే అమెరికాకు చెందిన టీనా గిబ్సన్ దంపతులు. 1992లో ఫ్రీజ్ చేసిన పిండాన్ని 1991లో పుట్టిన టీనా అనే మహిళ గర్భంలో (2017లో)కి ప్రవేశపెట్టారు. అలా జన్మించిన ఆ పాప పేరే ‘ఎమ్మా గిబ్సన్’. అలా టీనాకూ, ఎమ్మాకూ మధ్య భేదం ఏడాదే అన్నమాట. అంతేకాదు, ఎక్కువకాలం ఫ్రీజ్ చేసి విజయవంతమైన మానవ ఎంబ్రియో కూడా ఇదేనట. దీంతో తల్లి వయస్సు 33 ఏళ్లయితే.. కుమార్తె వయస్సు 32 ఏళ్లు. దీనిప్రకారం.. వీరిద్దరి వయస్సుల మధ్య వ్యత్యాసం కేవలం ఏడాది మాత్రమే.