కొత్త అమ్మలకు కాసుల వర్షం
రష్యాలో పిల్లల్ని కనే వారికి ఆ దేశం నోట్ల వర్షం కురిపిస్తుంది.అవును మీరు విన్నది నిజమే.ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధంలో రష్యన్లు లక్షలాదిగా చనిపోతుండటంతో ఆ ప్రభుత్వం గత ఏడాది నవంబర్ నుంచి ఈ నిర్ణయం తీసుకుంది. పాతికేళ్ల లోపు యువతులు,స్టూడెంట్స్‌కి ఈ ఆఫర్ ని ప్రకటించింది. 2024లో రష్యాలో కేవలం 5లక్షల మంది మాత్రమే జన్మించారు. ఇది 2023 కంటే 16 వేలు తక్కువ.అదేవిధంగా ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్దంలో 6లక్షల మంది రష్యన్లు మరణించారు.మరో 10 లక్షల మంది ప్రజలు దేశం విడిచి వెళ్లిపోయారు.దీంతో రష్యా ప్రభుత్వం జనాభా పెరుగుదలను ప్రోత్సహించేందుకు ప్రోత్సాహకాలు ప్రకటించింది. మొదటి బిడ్డ పుడితే లక్ష రూబుల్స్ ఇస్తామని ప్రకటించింది.అదేవిధంగా రెండు,మూడు కాన్పుల్లో ఉన్న మహిళలకు కూడా డబ్బులు చెల్లిస్తామని తెలిపింది.దీంతో ఆదేశంలోని 20 ఏళ్లకు పైబడి పాతికేళ్లు లోపు ఉన్న కొత్త అమ్మలకు కొద్దిగా ఊరటనిచ్చినట్లయ్యింది.

