2-3 రోజుల్లో అకౌంట్లోకి డబ్బులు: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
తెలంగాణ: ఆయిల్‌పామ్, అంతర పంటల రాయితీ డబ్బులను 2-3 రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. దీంతోపాటు సూక్ష్మ సేద్యం కంపెనీలకు సైతం రూ.55.36 కోట్ల బకాయిలను విడుదల చేస్తామన్నారు. ఇకపై రైతులకు పంటల సాగు బకాయిలను ఎప్పటికప్పుడు విడుదల చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. అటు 2024-25 సంవత్సరానికి నిర్దేశిత ఆయిల్‌పామ్ సాగు లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులను ఆదేశించారు.