NewsTelangana

కేసీఆర్‌ కాన్వాయ్‌లో మునుగోడుకు డబ్బులు

మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ ఒక్కో ఓటుకు రూ.40 వేలు పంచేందుకు సిద్ధమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. ఆ డబ్బును నిన్న చండూరు సభలో పాల్గొనేందుకు వచ్చిన సీఎం కేసీఆర్‌ తన కాన్వాయ్‌లో తీసుకొచ్చారని వివరించారు. సీఎం కేసీఆర్‌కు సీబీఐ భయం పట్టుకుందని.. అందుకే రాష్ట్రంలో సీబీఐ రాకుండా అడ్డుకుంటున్నారని బండి సంజయ్‌ ఆరోపించారు. సీబీఐని రాష్ట్రానికి రాకుండా రెండు నెలల క్రితమే జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ బయటికి రాగానే పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టారని తెలిపారు. లిక్కర్‌ స్కామ్‌లో కేసీఆర్‌ కుమార్తె కవిత పాత్రపై విచారణ జరుగుతున్నందున.. సీబీఐ నిగ్గు తేలుస్తుందన్న అనుమానంతోనే కేసీఆర్‌ నిషేధం విధించారని విమర్శించారు.