Home Page Sliderhome page sliderNational

బిజీగా మారిపోయిన మోనాలిసా..

అదృష్టం ఎవరిని ఎప్పుడు వరిస్తుందో చెప్పడం కష్టం. ఒక్కసారి ఆ అదృష్టం మన తలుపు తడితే .. ఎంత దరిద్రమైన దూరమవుతుంది. కామన్ మ్యాన్ కూడా సెలబ్రిటి మారుతాడు. ఎనలేని క్రేజ్ సంపాందించుకుంటారు. అలా మహా కుంభమేళాలో ఓ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో రాత్రికి రాత్రే ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. ఆమె అందానికి యువతే కాకుండా సినీ దర్శకులు సైతం ఫిదా అయ్యారు. కుంభమేళ తరువాత సినిమాలు, స్పెషల్ సాంగ్స్, యాడ్స్‌తో మోనాలిసా తన జీవితాన్ని బిజీ బీజీగా గడుపుతోంది. తాజాగా ఆమె ఓ స్పెషల్ సాంగ్‌లో నటుడు ఉత్కర్ష్ సింగ్‌తో కలిసి నటిస్తున్నారు. ముంబైలో యాక్టింగ్ క్లాసెస్ ద్వారా మోనాలీసా నైపుణ్యం సంపాదించుకుంది. మోస్ట్ ఫేవరేట్ ఇండియన్ సెలబ్రిటి జాబితాలో చేరిపోయింది.