Home Page SliderTelangana

97కు చేరిన మోమోస్ బాధితులు.. బీహార్ గ్యాంగ్ అరెస్ట్

బంజారాహిల్స్ లోని నందినగర్, సింగాడికుంటలో మోమోస్ తిని అస్వస్థతకు గురైన వారి సంఖ్య 97కు చేరింది. రెండు రోజుల క్రితం మోమోస్ తిన్న రేష్మ బేగం.. చికిత్స పొందుతూ చనిపోయింది. మరో 39 మంది అస్వస్థతకు గురై సిటీలోని వివిధ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయమై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఐదు బృందాలుగా ఏర్పడి నందినగర్, సింగాడికుంట సర్వే నిర్వహించారు. మోమోస్ తినడంతో తామూ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు 57 మంది తెలిపారు. ఇదిలా ఉండగా మోమోస్ విక్రయించిన వారితోపాటు వాటిని తయారు చేసిన వాళ్లపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి.. బీహార్ చెందిన ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.