మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశం.. గ్రీటింగ్స్ తెలిపిన ఎన్టీఆర్
నందమూరి కుటుంబం నుండి మరో హీరో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. స్టార్ నటుడు బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినిమా రంగప్రవేశం చేశారు. ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమలోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న తన తమ్ముడు మోక్షజ్ఞకు జూనియర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. హనుమాన్ మూవీతో పాన్ ఇండియా మార్కెట్‌ను షేక్ చేసిన టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ నందమూరి మోక్షజ్ఞను గ్రాండ్‌గా లాంచ్ చేస్తున్నాడు. ఇవాళ మోక్షజ్ఞ బర్త్ డే సందర్భంగా ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించారు.
సినిమా ప్రపంచంలోకి ప్రవేశించినందుకు అభినందనలు అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న నీకు తాతగారిలాగా అంత ఎత్తుకు ఎదగాలని, వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా. జన్మదిన శుభాకాంక్షలు మోక్షూ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని ఎం తేజస్విని నందమూరి సమర్పణలో ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నట్టు లెజెండ్ ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించింది. భారత ఇతిహాసం ఆధారంగా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)లో ఉండబోతున్నట్టు సమాచారం.

