Andhra PradeshHome Page Slider

బాలకృష్ణ దర్శకత్వంలోనే మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ

బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఆరంగేట్రం ఖరారు అయిపోయింది. బాలకృష్ణ దర్శకత్వంలోనే మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ ఉండబోతోందని సమాచారం. బాలయ్య అభిమానులు ఎదురుచూస్తున్న మోక్షజ్ఞ సినిమా 2024 ఏపీ ఎన్నికల అనంతరం మొదలు కాబోతోంది. ఈ మధ్య జరిగిన అమెరికాలోని తానా సభలలో ఈ విషయంపై ఓపెన్ అయిపోయారు బాలయ్య. అభిమానులు అడిగిన ప్రశ్నలకు జవాబుగా ఈ విషయం బయటపెట్టారు. బాలకృష్ణ కెరీర్లో సూపర్ హిట్ అయిన సైన్స్ ఫిక్షన్ మూవీ ఆదిత్య 369 సినిమాకు సీక్వెల్‌గా ఆదిత్య 999 సినిమాతో మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడంటూ బాలకృష్ణ పేర్కొన్నారు. అంతేకాక ఆచిత్రాన్ని తానే డైరక్ట్ చేస్తున్నట్లు కూడా తెలిపారు.