Home Page SlidermoviesNationalSpiritual

‘కన్నప్ప’లో మోహన్‌బాబు మనవరాళ్లు ఎంట్రీ..

మంచు విష్ణు భక్త కన్నప్పగా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘కన్నప్ప’లో మోహన్‌బాబు మనవరాళ్లు కూడా భాగం పంచుకుంటున్నారు. ఈ చిత్రంలో విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా ఎంట్రీ ఇచ్చారు. కవలలైన వీరి పుట్టినరోజు సందర్భంగా ‘కన్నప్ప’లో వీరి లుక్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇప్పటికే విష్ణు కుమారుడు అవ్రామ్ ‌కూడా కన్నప్ప చిన్ననాటి పాత్రలో నటిస్తున్నారని తెలిసిందే. ఈ ఫోటోపై మోహన్ బాబు స్పందిస్తూ ‘కన్నప్ప’తో నా మనవరాళ్లు చిత్ర పరిశ్రమలో అడుగుపెడుతున్నందుకు ఆనందిస్తున్నానని, నటనపై వారికెంతో అభిరుచి ఉందని పేర్కొన్నారు. విష్ణు మాట్లాడుతూ తన చిన్నమమ్మీలు తెరపై సృష్టించిన అద్భుతాన్ని చూడడానికి ఆసక్తిగా ఉందన్నారు. వీరిద్దరూ గతంలో ‘జిన్నా’ సినిమాలో ‘ఫ్రెండ్‌షిప్’ అనే పాట పాడి అలరించారు. మంచు కుటుంబం డ్రీమ్ ప్రాజెక్టుగా ఈ చిత్రం రూపొందుతోంది. వచ్చే వేసవిలో దీనిని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ అతిథి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.