మోహన్‌బాబు బేషరతుగా క్షమాపణలు చెప్పాలి..
మోహన్‌బాబు ఇంటివద్ద మంగళవారం హైడ్రామా చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన కుమారుడు మంచు విష్ణు దుబాయి నుండి రావడం, మంచు మనోజ్, మోహన్ బాబులు పరస్పరం పోలీసు కంప్లైంట్ ఇచ్చుకోవడం వంటి ఘటనలతో శంషాబాద్ జల్‌పల్లి వద్ద ఉన్న మోహన్‌బాబు ఇంటివద్ద ఈ ఘటనలు కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు మోహన్ బాబు. రంజిత్ అనే జర్నలిస్టుపై భౌతిక దాడికి పాల్పడ్డాడని, అతని మైకు లాక్కుని దవడ ఎముక విరిగేలా కొట్టారని వారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. మోహన్‌బాబు బేషరతుగా జర్నలిస్టులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పాత్రికేయులు ధర్నాలు చేస్తున్నారు. రౌడీ మూకల్లాంటి బౌన్సర్లను పెట్టుకుని మీడియాపై దాడి చేయడం ఏంటని విమర్శిస్తున్నారు.

