విష్ణు మాటకు మెహన్ బాబు షాక్
కుమారుడు మంచు విష్ణు మాటలతో షాక్ అయ్యానన్నారు మోహన్ బాబు. జిన్నా ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భంగా మంచు వారి ఫ్యామిలీ అంతా దీనిలో భాగస్వామ్యం అయింది. కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ప్రీరిలీజ్ ఈమెంట్‌లో భాగంగా మోహన్ బాబు మాట్లాడారు. అయితే వేదిక పైకి వెళ్లేముందు తనను తక్కువగా మాట్లాడమని విష్ణు సూచించిగా తాను ఆ మాటకు షాక్ అయినట్టు తెలిపాడు. “NTR , ANR లాంటి ఎందరో హీరోల చిత్రాల విడుదలకు సంబంధించి ఎన్నో వేడుకల్లో పాల్గొన్నా , వీళ్లల్లో ఎవరూ కూడా వేదికపై ఇన్ని నిమిషాలే మాట్లాడాలని చెప్పలేదు. ఈ రోజు విష్ణు అలా చెప్పే సరికి షాక్ అయ్యానన్నారు. దీంతో వేదికపై ఎక్కవగా మాట్లాడతానా? అనే ప్రశ్న తనకు కలిగింది అన్నాడు. అంతే కాకుండా జిన్నా మూవీ గురించి మాట్లాడిన ఆయన , ఇప్పటి వరకు ఏ సినిమాకి కష్టపడని విధంగా విష్ణు ఈ సినిమాకి కష్ట పడినట్టు తెలిపారు. దీనిలో ఓ స్పెషల్ సాంగ్ కోసం ప్రభుదేవని సంప్రదించగా.. వెంటనే ఆ సాంగ్‌కి ప్రభుదేవ కొరియోగ్రఫీ చేయడానికి ఒప్పుకున్నారని చెప్పుకొచ్చారు. ఇకపోతే హారర్ కామెడీగా రూపొందిన ఈ సినిమా ఈ నెల 21 ప్రేక్షకుల ముందుకు రానుంది.