రాజ్యాంగవిరుద్ధంగా మోదీ పాలన..కాంగ్రెస్ కూటమి నిరసన
ప్రధాని మోదీ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, అసలు రాజ్యాంగానికి విలువ ఇవ్వడం లేదని కాంగ్రెస్ కూటమి నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పాత పార్లమెంట్ భవనం నుండి కొత్త భవనం వరకూ ర్యాలీగా కదిలారు. సోనియా, రాహుల్, మల్లికార్జున ఖర్గేలతో పాటు కూటమిలోని ఇతర పార్టీల ఎంపీలు కూడా వారి వెంట నడిచారు. మోదీ ప్రతీసారి ఎమర్జెన్సీ కాలం గురించి మాట్లాడి పబ్బం గడుపుకుంటున్నారని, ఇప్పటికి వందసార్లు మాట్లాడి ఉంటారని ఎద్దేవా చేశారు. రాహుల్ సహా మిగతా సభ్యులు నినాదాలు చేస్తూ లోక్‌సభలో ప్రవేశించారు. రాజ్యాంగం కాపీలను పట్టుకుని గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు.

